
గత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ధరణి పోర్టల్ కారణంగా అత్యంత రహస్యంగా ఉండాల్సిన తెలంగాణలోని రైతులకు సంబంధించిన భూ రికార్డులతో పాటు సమస్త సమాచారం దేశం ఎల్లలు దాటిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆందోళన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ ద్వారా 2020 నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి లావాదేవీకి సంబంధించి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నంబర్, టెలిఫోన్ నంబర్‌తో సహా అన్ని వివరాలు కళ్లకు కట్టినట్టుగా పరాయిల చేతుల్లోకి వెళ్లాయని చెప్పారు.












చట్టం ప్రకారం దేశ పౌరుల వ్యక్తిగత సమాచారం ఏదైనా ఆ వ్యక్తి అనుమతి లేకుండా సేకరించడం చట్టరీత్యా నేరం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఉండాల్సిన సమాచారం విశ్వసనీయత లేకుండా నిబంధనలు ఉల్లంఘించారు.






