
DCIM100MEDIADJI_0015.JPG
తెలంగాణ మణి కిరీటం సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు, అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ 135 ఏళ్ల సుధీర్ఘ చరిత్ర కలిసిన సింగరేణి, ప్రగతి పథాన సాగుతూ దేశానికి వెలుగులు నింపుతుండటం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.
