FUNERAL GUNTUR

అమరావతి, ఫిబ్రవరి 5: గుంటూరు జిల్లా పోలీసుశాఖలో ప్రేలుడు పదార్థాలను కనిపెట్టే జాగిలంగా రాబర్ట్ విశేషమైన సేవలందించినదని, వీఐపీలు – వీఐపీలు బందోబస్తు సందర్భంలో సమర్థవంతంగా విధులు నిర్వహించి ఎక్కడా ఎటువంటి అనుమానాస్పద జాడలు ఉంటే తక్షణమే కనిపెట్టి ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడంలో పోలీస్ సిబ్బందికి ఎంతో తోడ్పాటు అందించేదని “రాబర్ట్ జాగిలం” యొక్క గొప్పతనాన్ని శ్రీ అదనపు ఎస్పీ కొనియాడారు. 2017 సం.లో explosive జగిలంగా రాబర్ట్ ఇంటిలిజెన్సు విభాగంలో బొర్రా. వెంకటేశ్వరరావు డాగ్ హ్యాండ్లర్ గా శిక్షణ పూర్తి చేసుకొని గుంటూరు జిల్లాకు వచ్చినప్పుడు నుండి ఎన్నో బందోబస్తుల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిందన్నారు. జిల్లాకు ముఖ్య వ్యక్తులు విచ్చేసే సమయంలో వారి భద్రత కొరకు బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ చేపట్టే ముందస్తు భద్రత చర్యల్లో చురుకుగా పాల్గొని, ఎక్సప్లోజివ్స్ ను గుర్తించేందుకు తనిఖీలు నిర్వహించేదన్నారు. అదే విధంగా పోలీసు పరేడ్ గ్రౌండులో నిర్వహించే గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ముఖ్య అతిధులకు పుష్ప గుచ్ఛాలను అందించడంలో నేర్పుగా వ్యవహరించేందన్నారు. గుంటూరు పోలీస్ విభాగానికి ఎనిమిది సంవత్సరాల మూడు నెలలు విశేష సేవలందించి వృద్ధాప్యం కారణంగా అనారోగ్య సమస్యలతో పోలీస్ జాగిలం రాబర్ట్ మరణించిందని వైద్యుల సహాయంతో పోలీస్ అధికారులు దృవీకరించారు. పోలీస్ జాగిలం రాబర్ట్ కు ఎఆర్ అదనపు ఎస్పీ A. హనుమంతు, ఎఆర్ డిఎస్పీ ఏడుకొండల రెడ్డి, ఆర్ఐలు శ్రీహరి రెడ్డి, శివరామకృష్ణ, పలువురు ఆర్. ఎస్.ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పాలు, దండలు సమర్పించి, అధికారిక లాంఛనాలతో నివాళులు అర్పించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *